A Woman Killed Her Husband For His Job In Bhadradri Kotthagudem: మానవత్వం మంటగలిసిపోతుంది. చిన్న చిన్న కోరికల కోసం, డబ్బుల కోసం సొంతవారినే చంపుకుంటున్నారు జనాలు. వారి అడ్డు తొలగిస్తే.. తాము కోరుకుంది సొంతమవుతుందన్న భ్రమలో ఎంతకైనా తెగించేస్తున్నారు. తాజాగా ఒక మహిళ కూడా అలాగే ఓ దారుణానికి ఒడిగట్టింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భర్తనే కడతేర్చింది. తాగొచ్చి నిత్యం వేధింపులకు గురి చేసే తన భర్త చంపేస్తే.. అతని నుంచి ఉపశమనం లభించడంతో పాటు ఉద్యోగం కూడా లభిస్తుందనుకొని హతమార్చింది. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి, ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
Veera Simha Reddy: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరణ.. అడ్డా మార్చిన బాలయ్య
ఆ వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గాంధీకాలనీకి చెందిన కొమ్మరబోయిన శ్రీనివాస్(50) కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తన భార్య సీతామహాలక్ష్మీ (43), తనయుడు సాయికుమార్‌తో కలిసి స్థానికంగా నివాసముంటున్నారు. కట్ చేస్తే.. గత నెల 29వ తేదీన అర్థరాత్రి తన భర్త వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని భార్య సీతామహాలక్ష్మి జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు కానీ, ఫలితం లేకుండా పోయింది. కొన్ని గంటల తర్వాత ఆయన మృతి చెందాడు. అయితే.. సాయికుమార్‌కి తండ్రి మరణంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
SI Subhashree Case: లేడీ ఎస్సైని టార్గెట్ చేసి.. కత్తులతో వెంబడించి..
మరోవైపు.. భర్తని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత సీతామహాలక్ష్మి కనిపించకుండా పోయింది. దాంతో ఆమెపై నిఘాపెట్టారు. మంగళవారం రాత్రి ఆమె హైదరాబాద్‌కి పారిపోయేందుకు, కొత్తగూడెం రైల్వేష్టేషన్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. రైల్వేస్టేషన్‌కి వెళ్లి ఆమెని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా.. తానే భర్తని చంపానని పేర్కొంది. ఆరోజు రాత్రి తన భర్త తాగిన మైకంలో ఇంటికొచ్చాడని, నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టానని తెలిపింది. భర్త తాగొచ్చి నిత్యం తనని వేధించేవాడని తెలిపింది. వేధింపులు తప్పడంతో పాటు కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం వస్తుందన్న ఉద్దేశంతోనే హత్య చేసినట్లు అంగీకరించింది.