Officer caught by ACB while taking bribe: వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి జలగలు జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎంత మంది ఏసీబీకి పట్టుబడినా ఎన్ని అరెస్టులు జరిగినా ఏ మాత్రం జంకడం లేదు. గతంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడితే కేసు తేలే వరకు ఏళ్లు గడిచేది. కానీ ప్రస్తుత రోజుల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే ఏమంత నేరం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారుల చేతిలో అరెస్టయిన 6 నెలలు లేదా ఏడాదిలోగా మళ్లీ సేమ్ పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. ఓ ఏడాది తర్వాత మళ్లీ లాభదాయకమైన ప్రాంతాల్లోకి మారుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఏ చిన్న పని కోసం వెళ్లినా పైసల్ లేనిదే పని జరగడం లేదు.
Read also: Mexico Shooting: బార్‌లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
లంచం ఇచ్చుకోలేని వారు అధికారుల చుట్టూ చెప్పులరిగే తిరగాల్సిందే. అలా తిరిగినా పని అవుతుందన్న నమ్మకమూ లేదు. ఇలాంటి ఘటనే నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణపేటలో వైద్యఆరోగ్యశాఖలో అవినీతి జలగలు బయటపడ్డారు. హనుమంతు అనే అధికారి పాతిక వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. హనుమంతును విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి రవడంతో షాక్ తిన్న ఏసీబీ అధికారులు. DM&HO రాం మనోహర్ సూచన మేరకే డబ్బులు డిమాండ్ చేసినట్లు హనుమంతు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఆసుపత్రుల నుంచి నెల వారి మామూళ్లు, సిబ్బంది పోస్టింగ్ ల నుంచి వసూళ్లలో కీలకం హనుమంతే అని నిర్ధారించారు. హనుమంతుని రాత్రి 2 గంటల వరకు సాగిన విచారించారు అధికారులు. DM&HO రాం మనోహర్ పై శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది.
Read also: Mexico Shooting: బార్‌లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
నారాయణపేట జిల్లాలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంపై గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈనేపథ్యంలో.. కోస్గీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి కోసం జిల్లా వైద్యశాఖ మాస్ మీడియా అధికారి హన్మంతు రూ.80 వేలను డిమాండ్ చేశాడు. అయితే.. బాధితుడు, ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్ కలాల ఆంజనేయులు గౌడ్ ఏసీబీని ఆశ్రయించాడు. అయితే.. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అతడిపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Moinabad Episode: రెండో రోజు కస్టడీ.. కీలకం కానున్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక