Viral Video: మొసలి పేరు వింటనే జనాలు భయపడుతుంటారు. అలాంటిది ఓ భారీ మొసలి ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద 10 అడుగుల భారీ మొసలి నదీ నుంచి బటయకు వచ్చి, సమీపంలోని రైలింగ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్న ప్రజలు తమ మొబైల్స్‌లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. స్థానికులు, పోలీసు, అటవీ శాఖ అధికారులు అతికష్టం మీద మొసలిని పట్టుకున్నారు.
Read Also: Ritika Sajdeh Trolls: రోహిత్ శర్మ సతీమణి రితికాపై ట్రోల్స్!
గంగా నదీ కాలువ నుంచి మొసలి బయటకు వచ్చింది. మొసలి తిరిగి నీటిలోకి వెళ్లేందుకు రైలింగ్ ఎక్కే ప్రయత్నం చేసి విఫలమైంది. అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. మొసలిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు కళ్లు కనిపించకుండా దాని తలపై గుడ్డకప్పి, తాళ్లతో బంధించారు. దాని నోటికి తాడును కట్టి జాగ్రత్తగా పట్టుకున్నారు. కొన్ని గంటల తర్వాత మొసలిని జాగ్రత్తగా కాలువలోకి వదిలిపెట్టారు.
#Crocodile came out of Narora Ganga Ghat of #Bulandsher and came on the road, created panic#Up #uttarpradesh #WATCH #uppolice #viralvideo #india pic.twitter.com/3LvorCDOR9
— 6 Block South Patel Nagar (NGO REGD)🇮🇳 (@NgoPatelNagar) May 29, 2024