Congress Leader Murder Case: మెదక్ జిల్లా కాంగ్రెస్ యువ నేత అనిల్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ హత్య కేసును ఛేదించడానికి నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో అనిల్ కారుని అడ్డగించి గన్ తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేసిన దుండగులు. ఇక, అనిల్ మొబైల్ ని స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్టు సమాచారం.
Read Also: Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
అయితే, ఈ నెల 14వ తేదీన గాంధీభవన్‌లో పార్టీ పదవుల నియామకం నిమిత్తం జరిగిన ముఖాముఖికి హాజరైన అనిల్ తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఇక, గాంధీభవన్ లో మీటింగ్ తర్వాత అనిల్ ఎక్కడికి వెళ్ళాడు..? ఎవరెవరిని కలిశాడు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. హత్యకు ముందు కారులో ఎంత మంది ఉన్నారు..? హత్య జరిగిన సమయంలో ఒక్కడే కారులో ఎందుకు ఉండాల్సి వచ్చిందో అనే దానిపై విచారణ చేస్తున్నారు.