హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మీద బోలెడు ఆశలు పెట్టుకుంది తెలంగాణ బీజేపీ. వాస్తవంగా మాట్లాడుకుంటే.... ఆ పార్టీకి సీటు గెలిచేంత బలం లేదు. ఆ విషయం పార్టీ ముఖ్యులు అందరికీ తెలుసు. పిక్చర్ క్లియర్‌గా ఉంది. అయినా సరే... ఉనికి కోసం బరిలో దిగింది కాషాయ దళం. అంతవరకు బాగానే ఉంది. కానీ.... ఆ పోటీ పేరుతో తమను తాము పరీక్షించుకునే దగ్గరే తేడా కొట్టిందంటున్నారు పరిశీలకులు. బీజేపీ కార్పొరేటర్స్ అందరి ఓట్లు కమలానికి…
రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏపీ సీఆర్డీఏ.. అయితే, సీఆర్డీఏ రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.. అయితే ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది.
రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ..
గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..