Medak: ఆ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలే ఉన్నారు. మగ పిల్లాడి కోసమని ఆ వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం దంతేపల్లి తండాలో చోటు చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే.. వారసుడు కావాలని పట్టుబట్టిన ఘనుడు మైనర్ బాలికని రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.
Read Also: Earthquake: చైనా, బంగ్లాదేశ్, దావోస్‌లోనూ భూప్రకంపనలు
అయితే,మొదటి భార్యకి ముగ్గురు ఆడ పిల్లలు ఉండటంతో కొడుకు కోసం రెండో పెళ్లి చేసుకునేందుకు శివాలాల్(36) ప్లాన్ చేశాడు. దీంతో, 16 ఏళ్ల బాలికను వివాహం నిశ్చయం కావడంతో ఈ విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక, రంగంలోకి దిగిన చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు బాలికని సఖి కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా మైనర్ బాలిక తల్లిదండ్రులతో పాటు రెండో పెళ్లికి రెడీ అయిన శివాలాల్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారందరి మీద కేసు నమోదు చేశారు.