Married Woman: సమాజంలో వివాహ బంధాలు కన్నీటిని మిగిలిస్తున్నాయి. బంధం, బంధుత్వాల కన్నా.. కొందరు డబ్బులకు వ్యామోహం చూపుతుంటే మరొకొందరు వివాహేతర సంబంధాలకు ఎడిక్ట్ అవుతున్నారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత కరువై చిన్న చిన్న గొడవలతో ఒకరిపై మరొకరు చంపడానికి చావడానికి సిద్దమవుతున్నారు. భర్త వేధింపులు తాళలేక వివాహింత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Read also: Bigg boss: గెలిచి ఓడిన శ్రీహాన్, ఓడి గెలిచిన రేవంత్!!
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత భర్త వేధింపులకు బలైంది. పుట్టింటికి వచ్చిన వివాహిత ఒల్లపు సోని పెళ్లై అత్తింకి వెళ్లిన మళ్లీ పుట్టింటికి వచ్చింది అక్కడ భర్త వేధిస్తున్న సంగతి తెలిసి కుటుంబ సభ్యులు బాధలో వున్న సమయంలో తనను తాను బాధపడింది. తల్లిదండ్రులకు భారంగా ఉండేలేకపోయింది. భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన వివాహిత ఒల్లపు సోని తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం పుట్టింట్లోంచి పని ఉందంటూ ఒల్లపు సోని బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు గ్రామమంతా వెతికారు. అయితే.. చివరకు ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో సోనీ మృతదేహం కనిపించడంతో కుటుం సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. సోనీ మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. అయితే కూతురు సోనీ సూసైడ్ నోట్ లోరాసిన రాతలు అందరిని కంటతడి పెట్టించాయి. సూసైడ్ నోట్ లో ఏముందంటే.. అమ్మానాన్న మీతో కలిసి సంతోషంగా జీవించాలని వుంది. అందుకే మీకు దూరంగా వెళ్లి చావడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు మళ్లీ జన్మంటూ వుంటే మీ అందరి మధ్య పుడతాను. కానీ మళ్లీ వాడికి ఇచ్చి పెళ్లి చేయకండి అంటూ వివాహత సోనీ సూసైడ్ లెటర్ బావి పక్కన లభించింది. ఆసూసైడ్ నోట్ చదివి గ్రామంలోని వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు.
Love Married at YSP Office: ప్రేమికులను కలిపిన ఎమ్మెల్యే.. వైసీపీ కార్యాలయంలో పెళ్లి..