ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. అయితే.. తాజాగా.. సికింద్రాబాద్ కాల్పులను మావోయిస్టు పార్టీ ఖండించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. అగ్నిపథ్ పథకాన్ని రద్ధు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. చనిపోయిన రాకేష్ కుటుంబానికి ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. గాయపడ్డ వారందరికీ చికిత్స అందించాలని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని లేఖలో వెల్లడించారు.