Maoists : తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించే విషయంలో భద్రతా దళాలు ఈరోజు సంచలనాత్మక విజయాన్ని నమోదు చేశాయి. జిల్లాలోని కీలక మావోయిస్టు నాయకుడు బడే చొక్కారావు తో సహా మొత్తం 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో తొమ్మిది మంది మహిళా మావోయిస్టులు ఉండటం ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను పెంచుతోంది.
Dhurandhar: ధురంధర్ సినిమా.. నిజజీవితంలో రహమాన్ డకైత్‌ను చౌదరి అస్లాం ఎలా ఎన్‌కౌంటర్ చేశారు.?
సిర్పూర్ యూ మండలం పరిధిలోని అటవీ ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికి గురించి పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించారు. గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB), కొమరం భీం జిల్లా పోలీసు సిబ్బంది సంయుక్తంగా కాకిరబొడ్డు, బాబ్జీపేట అటవీ ప్రాంత శివార్లలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించిన భద్రతా దళాలు, వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వీరు కాల్పులు జరపవచ్చనే అనుమానం ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగారు.
ఈ ఆపరేషన్‌లో, భద్రతా దళాలు మావోయిస్టుల నుంచి ప్రమాదకరమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక ఏకే-47 రైఫిల్తో పాటు ఇతర ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కీలక అరెస్టుల తర్వాత, పట్టుబడిన మావోయిస్టులందరినీ ఉన్నత విచారణ, తదుపరి చర్యల కోసం వెంటనే హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలించారు.
అయితే, పట్టుబడిన ఈ మావోయిస్టులు పోలీసుల ఆపరేషన్‌లో అరెస్టు అయ్యారా లేదా స్వచ్ఛందంగా లొంగిపోయారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ బృందాన్ని అదుపులోకి తీసుకున్న అంశంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు త్వరలో అధికారికంగా ప్రకటించడానికి, పత్రికా సమావేశం నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు స్థానిక వర్గాలు తెలియజేశాయి. ఈ అరెస్టులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలను నిలువరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.
Cameron Green IPL Price: కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!