Harish Rao: ఒకటి, రెండు సీట్లకే బీజేపీ అధికారంలోకి వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గెలిచే ఒకటో రెండో సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందా హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… 2018 ఎన్నికల్లో బీజేపీ ఒకే సీటు గెలిచిందని, ఈసారి కూడా ఒక్క సీటు మాత్రమే వస్తుందన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బీజేపోడు బావి దగ్గర మీటర్ పెడుతా అంటున్నాడు.. కాంగ్రెసోడు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. కేసీఆర్ మాత్రం 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తా అంటున్నాడని పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: కేటీఆర్, కేసీఆర్‌లపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
బీజేపీ పార్టీ యువతను మోసం చేసిందన్నారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఈ తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. మరి ఇచ్చాడా? ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎరువు బస్తాలు, కరెంట్ కోసం ఎన్నో తిప్పలు పడ్డామని గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్న హరీష్ రావు.. ఇప్పుడిప్పుడే తెలంగాణను బాగు చేసుకుంటున్నామన్నారు. చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read: Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుంది..
తాజావార్తలు
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!