సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర ఇంటిలో భారీగా నగదు లభ్యమైంది. ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 60 లక్షల రూపాయల నగదు తోపాటు పెద్ద ఎత్తున వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
మాజీ ఎంపీ గడ్డం వినోద్ ఇంట్లో సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో గడ్డం వినోద్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని తెలిపారు. దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఈడీ ప్రకటించింది. అంతేకాకుండా.. భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించింది ఈడీ. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. యశ్వంత్ రియాల్టీతో పాటుగా గడ్డం వినోదు భార్య పేర్లతో భారీగా ఆస్తులను గుర్తించారు.
హైదరాబాద్ లో శ్రీ ఆదిత్య హోమ్స్ లో మూడవరోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఊర్జిత, ట్రెడెంట్ ప్రాపర్టీస్ లో సోదాలు చేపట్టారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించారు. ఫ్లాట్ల అమ్మకాలపై ఐటీ శాఖ వివరాలు సేకరిస్తున్నారు.
హైదారబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఊర్జిత, ట్రెడెంట్ ప్రాపర్టీస్ లో సోదాలు చేపట్టారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఇవాళ (సోమవారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్,…