Implications of Hunting: ఒక్కొక్కసారి మనం చేసిన వేట మనకే చిక్కుల్లో పడేస్తుంటుంది. హ్యాపీగా షికారుకు వెళ్లాలి అనుకునే వారికి కొన్ని సందర్భాల్లో ఆషికారే నరకకూపంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. ఆచిక్కుల్లో పడ్డప్పుడు మనకు రక్షించే వారు ఉంటే మనం బతికి బట్టకలిసినట్లే కానీ ఆపరిసర ప్రాంతాల్లో రక్షించేవారు లేకుంటే ఇక మన జీవితంపై ఆశ వదులుకోవాల్సిందే. కానీ.. ఓ ప్రబుద్ధుడికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్లు ఉంది అతను బతికేశాడు. రాళ్లమధ్యలో ఇరుక్కుపోయినా చివరికి బతికేశాడు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం వేట కోసం అడవి వైపు వెళ్లాడు. అయితే ఘన్‌పూర్ తండా మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా ఓ చోటు రాళ్ల గుట్టపై ఏదో జంతువు కనిపించినట్లు అనిపించింది.. ఆరాళ్లపైకి వెళ్లి వెతుకుతున్న సమయంలో తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ జారిపోయి రాళ్లమధ్యలో పడిపోయింది దీంతో ఆఫోన్ అందుకునే క్రమంలో రాజు జారి రాళ్లమధ్యలో ఉన్న గుహలో పడిపోయాడు. లోతైన రంధంలో పడిపోయి బయటకు వచ్చే అవకాశం లేక కాపాడండి ప్లీజ్.. ఎవరైనా ఉన్నారా? అంటూ ఆర్తనాదాలు చేస్తూ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. రాత్రైనా రాజు ఇంటికి రాలేకపోయే సరికి కుటుంబ సభ్యులు అడవంతా గాలించారు అయినా రాజు జాడ దొరకలేదు.
బుధవారం మధ్యాహ్నం రాళ్ల మద్యలో నుంచి అరుపులు రావడంతో అటువైపు వచ్చి చూశారు రాళ్లమధ్యలో రాజు పడిపోయినట్లు గుర్తించారు. గ్రామస్థుల సాయంతో బయటకు తీసేందుకు ప్రత్నించిన రాజును బయటకు తీయలేకపోయారు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరంధ్రం ద్వారా రాజుకు తొలుత మంచినీళ్లు, ఓఆర్‌ఎస్ అందించారు. ఆతర్వాత బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం జేసీబీ, ఫైరింజన్ ను అక్కడికి రప్పించారు..ఈలోగా చీకటి పడటం సహాయ కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్న రాజును బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Pathaan: పఠాన్ మూవీకి షాక్.. షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మ దహనం