కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం వేట కోసం అడవి వైపు వెళ్లాడు. అయితే ఘన్‌పూర్ తండా మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా ఓ చోటు రాళ్ల గుట్టపై ఏదో జంతువు కనిపించినట్లు అనిపించింది.. ఆరాళ్లపైకి వెళ్లి వెతుకుతున్న సమయంలో తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ జారిపోయి రాళ్లమధ్యలో పడిపోయింది దీంతో ఆఫోన్ అందుకునే క్రమంలో రాజు జారి రాళ్లమధ్యలో ఉన్న గుహలో పడిపోయాడు.