Mahmood Ali: ఇతర పార్టీ నాయకుల తప్పుడు మాటలు, హామీలు నమ్మితే.. తెలంగాణ అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీల మత పెద్దలతో మహ్మద్ అలీ సమావేశం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మానకొండుర్ రావడం జరిగిందన్నారు. తెలంగాణ వస్తే అనేక ఇబ్బందులు వస్తాయని సీఎం కేసీఆర్ తో ఢిల్లీలో ఉండే పెద్దలు అనేక సార్లు అన్నారని తెలిపారు. తెలంగాణ వేస్తే ఎలా అభివృద్ది చేసుకుంటారు నీళ్ళు లేవు కరెంట్ లేదు అనేక ఇబ్బందులు వస్తాయని అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎలా అభివృద్ది చెందిందో దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ లో అన్ని జిల్లాలకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కోసం కరీంనగర్ ప్రజలు అండగా నిలిచారు నేను కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. మూడోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి సీఎం కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారని అన్నారు. దీక్ష విరమించకపోతే కేసీఅర్ ప్రాణాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని డాక్టర్ల సూచన చేశారని తెలిపారు. 50 ఎండ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లిం మైనారిటీలకు చేసింది ఏం లేదు .. ఓట్లు వేయించుకొని మోసం చేయడం తప్ప? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమైండ్ కంట్రోల్ తో.. లా అండ్ ఆర్డర్ కోసం లక్ష కెమెరాలతో ఎప్పుడు నిఘా పర్యవేక్షణలో తెలంగాణ ఉందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ లో ఇన్ని లక్షల ఎకరాల్లో పంటలు ఎలా పండుతున్నాయి అని కేంద్రమంత్రి అడిగారని అన్నారు. కేసీఅర్ కు ఉన్న నాయకుని చరిష్మా లక్షణాలు ఆయన కొడుకు కేటీఆర్ కు వచ్చాయని తెలిపారు. నరేంద్ర మోడీ రాష్ట్రం గుజరాత్ తను వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు ఏం బాగాలేవని అన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు అందించి మహిళల కష్టాలు తీర్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. 50 ఎండ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు ఎం చేసింది మళ్లీ ఓటు వేయమని అడుగుతున్నారు? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఉన్న ముస్లిం మైనారిటీలు అందరూ సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 934 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. 2014 నుండి 2013 వరకు కేసీఅర్ ప్రభుత్వం 1100 కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. ఆర్.ఎస్.ఎస్ లో పని చేసిన రేవంత్ రెడ్డి కి పిసిసి అధ్యక్షుడు పదవి ఇచ్చారు.. తెలంగాణ కాంగ్రెస్ ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను అన్ని వర్గాలను సమానంగా చూసిన ప్రభుత్వం బీఅర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత వారి పాలన ఎలా ఉందో దేశ ప్రజలు అందరు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన సీఎం కేసీఆర్ ను రాష్ట ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఇతర పార్టీ నాయకుల తప్పుడు మాటలు హామీలు నమ్మితే తెలంగాణ అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. మానకోండుర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భారీ మెజారిటీతో విజయం సాధించ బోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు.
Shabbir Ali: కేసీఆర్ కమీషన్ల పనులు తప్ప.. పేదలకు ఉపయోగపడేవి చేశాడా? షబ్బీర్ అలీ ఫైర్