ప్రజా గాయకుడు గద్దర్ అంటే తెలియనివారుండరు.. ఆయనో కరుడుగట్టిన కమ్యూనిస్టు అనిది నిన్నటి మాట.. ఇప్పుడా ఎర్రమందారం కాస్తా.. కలర్ మారబోతుందా? అనే చర్చ సాగుతోంది.. ఆయన ఈ మధ్య తరచూ వివిధ పార్టీల నేతలను కలవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఈ కామ్రేడ్.. ఏ పార్టీ కండువైనా కప్పుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. దీనికి కారణం లేకపోలేదు.. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలను కూడా కలుస్తూ వచ్చారు…