Mahesh Goud: ఎన్నికలొస్తే పథకాలు.. అయిపోగానే కోతలు.. కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Goud Satires On CM KCR: ఎన్నికలొస్తే పథకాలు.. అయిపోగానే కోతలు పెడుతున్నారని సీఎం కేసీఆర్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మునుగోడు ఎన్నికల్లో గొర్రెల పంపిణీకి నిధులు అకౌంట్లో వేశారని, కానీ ఎన్నికలు అయ్యేవరకు ఆ నిధుల్ని ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. ఎన్నికలు అయ్యే వరకు ఓమాట.. తర్వాత ఇంకో మాట మారుస్తారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనేదే కేసీఆర్ యావ అని, మంత్రులేమో వేల కోట్లు వెనక్కి వేసుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపణలు చేశారు. కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్రాన్ని నడుపుతున్నారన్నారు. ఉద్యమంలో ఆంధ్ర నేతలను తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాడని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ సూచన మేరకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని మహేశ్ గౌడ్ తెలిపారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
పీసీసీ ప్రధాన కార్యదర్శి చెరుకు సుధాకర్ కూడా కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గోల్మాల్ గోవిందం ఎక్కడో లేడని.. కేసీఆరే గోల్మాల్ గోవిందమని అభిప్రాయపడ్డారు. రైతు స్వరాజ్య వేదిక నివేదిక ఇస్తే.. ఉరికించి కొడతానని మీ ఎమ్మెల్సీ అన్నారన్నారు. అదీ.. రైతుల మీద మీకున్న చిత్తశుద్ధి అని ఎత్తిచూపారు. మునుగోడులో 30 వేల మంది యాదవుల అకౌంట్లో డబ్బులు వేసి, ఆ తర్వాత వాటిని ఫ్రీజ్ చేశారన్నారు. కేసీఆర్‌కి నిజంగా విజన్ ఉంటే.. ఇన్ని అప్పులు తెచ్చేవాడా? అని నిలదీశారు. ప్రభుత్వ స్థలాలు అమ్మింది, అమ్ముతోంది కేసీఆరేనని ఆరోపించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ.. అమిత్ షాకి హాట్ లైన్లో ఉండి పని చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి.. బీఆర్ఎస్ కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు.
Delhi Woman Dragged By Car: యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసు.. శవపరీక్షలో ఏం తేలిందంటే?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!