Road Accident: మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం నాడు రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న లారీ కారును తప్పించబోయి పక్కనే పక్కనే వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Bihar Scam: ‘‘పిల్లలు లేని మహిళలని గర్భవతిని చేయండి, రూ.10 లక్షలు పొందండి’’..
అయితే, తొలుత బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో కారు స్వల్పంగా దెబ్బ తినింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం స్థానిక మహబూబ్ నగర్ దావాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ప్రమాద ఘటనను పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చనిపోయిన ప్రయాణికుడు కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరణించిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతుల బంధువులకు అప్పగించనున్నారు.