Minister Seethakka: రాష్ట్ర క్యాబినెట్‌లో అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. మహబూబాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అర్బన్ నక్సలైట్స్ ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నన్ను అనేక విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. నా మనసును నొప్పించారని మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. నాకు చాలా బాధగా ఉందని అన్నారు.
Read also: Sridhar Babu: మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..
మీ నాయకులు మోడీ, అమిత్ షాలు మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రమ్మని అంటుంటే.. మీరు మమ్మల్లి అర్బన్ నక్సలెట్స్ అనడం శోచనీయం అన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ , బీఆర్‌ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సర కాలంలో ప్రభుత్వానికి ప్రజా ఆమోదం తెలిపారని అన్నారు. నేను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న , వరంగల్ లో లాయర్ గా పనిచేసిన అన్నారు. నేను మూడు సార్లు ప్రజా ప్రతినిధిగా పనిచేసిన అన్నారు.
Read also: Viral Video: కారుపై ఆభరణాలు వదిలి వెళ్లిన యువతి.. ఎవరైనా దొంగిలిస్తారా? అని ప్రయోగం..(వీడియో)
బీజేపీ పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. బండి సంజయ్ నన్ను నేరుగా కామెంట్స్ చేయాలన్నారు. కానీ క్యాబినెట్ అందరిని అనడం సరికాదన్నారు. బీజేపీ మద్దతుతో టీడీపీ నుండి గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. వరంగల్, కరీంనగర్ పోరాటాల గడ్డ, బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. మన వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ బాధాకరమన్నారు. ఎన్‌కౌంటర్ లేని తెలంగాణ, శాంతి భద్రతల తెలంగాణనే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు.
AjithKumar : విదాముయార్చి సంక్రాంతి రిలీజ్ ఫిక్స్..