Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.
- ORRపై ఫార్చూనర్-డీసీఎం ఢీ.. ఘోర ప్రమాదం
- మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలు
- టైరు ఊడిపోవడంతో ఆగిన వాహనం.. ప్రమాదానికి కారణం
- కేటీఆర్ ఆసుపత్రికి చేరుకుని పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఆదివారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు అక్షర (23), దిశీర (19) తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న మరో యువకుడు అభిరామ రెడ్డి , డ్రైవర్ అరికపూడి దుర్గా సాయి కూడా గాయాలపాలయ్యారు.
Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?
Also Read
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- OTR: గులాబీ ముఖ్యుల్ని కట్టడి చేయడంపై సీఎం ఫోకస్?
నార్సింగి పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) జంక్షన్ దాటుతున్న సమయంలో రాత్రి 8:52 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారు ముందు వెళ్తున్న ఒక డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ముందు వెళ్తున్న డీసీఎం వాహనం టైరు అకస్మాత్తుగా ఊడిపోవడంతో అది ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న ఫార్చూనర్ కారును డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో అది డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఫార్చూనర్ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. పెద్ద కుమార్తె అక్షరకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్న కుమార్తె దిశీరకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న అక్షరను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అకస్మాత్తుగా ఆగిపోవడం , వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!