AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది తదుపరి మార్గంలో పయనిస్తూ రేపు పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, అలల ఉధృతి పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అందువల్ల మత్స్యకారులు ఎవరూ బుధవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ముఖ్యంగా 7 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న చిన్న పడవల వినియోగం ప్రస్తుతం ఎంతమాత్రం సురక్షితం కాదని, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో అలజడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!