టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదుయాష్కీ గౌడ్… ఆ మూడు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించిన ఆయన.. దేశంలో ఎక్కడ మతతత్వ అల్లర్లు జరిగిన హైదరాబాద్ తోనే లింక్ ఉంటుందన్నారు.. ఇక, ఇలాంటి సంఘటనలలో కేంద్రం సమగ్రమైన విచారణ జరిపించడంలో విఫలమైందని మండిపడ్డారు మధుయాష్కీ గౌడ్.. మరోవైపు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన సంఘటనలలో నిందితులకి భారతీయ జనతా పార్టీ వాళ్లతో లింకులు ఉన్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత.. ఇక, లష్కర్ తోయిబా లింకులన్నీ హైదరాబాదులోనే ఉన్నాయి.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు… ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ జరపడం లేదని నిలదీసిన ఆయన.. హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ, ఎంఐఎం మిత్ర పక్షాలుగా ఉన్నాయి… అందుకే హైదరాబాద్ పై బీజేపీ పెద్దగా దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: IMD: ఈ రోజు అత్యంత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ తాజా వార్నింగ్