హరీష్‌రావు, ఈటలపై మధుయాష్కీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి హరీష్‌రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్… జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నమ్ముకొని ఈటల రాజేందర్ మోసపోయారని గమనించాలని సూచించారు.. ఇక, రబ్బరు చెప్పులు కూడా లేని హరీష్ రావుకు వందల కోట్ల ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో దొంగ నోట్లు పంచిన కేసు ఉండే అని కామెంట్ చేసిన యాష్కీ.. ఇప్పుడు దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తూ అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టారంటూ ఫైర్ అయ్యారు.. హుజురాబాద్ ఉపఎన్నికలు వాయిదాపై స్పందిస్తే.. ఎన్నికలకు వాయిదా వేస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ నమ్మకమంటూ సెటైర్లు వేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన వారి కుటుంబాలకు అదుకొని రాక్షసుడి కేసీఆర్ అంటూ ఫైర్ అయిన మధుయాష్కీ… కృష్ణనది జలాల గురించి ప్రధాన మంత్రితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రతి సారి 50 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేస్తానని ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు తాగిన మైకంలో కళలు కంటాడని ఎద్దేవా చేశారు. ఇక, రూ. 150 కోట్లతో ఎమ్మెల్సీ కవిత ఇల్లు కట్టుకుంది.. కానీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఒక్కటైన ఇవ్వలేదని ఆరోపించారు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది.. జీవన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు మధుయాష్కీ గౌడ్.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!