Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..
- ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం
- 452 మంది నుంచి భారీ వసూళ్లు
- నకిలీ కంపెనీలతో మళ్లీ మోసం ప్రయత్నం
- ముగ్గురు అరెస్ట్.. మరికొందరు పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలనే నిరుద్యోగుల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న ఒక కేటుగాళ్ల ముఠా మాదాపూర్ కేంద్రంగా భారీ మోసానికి తెరలేపింది. ‘Camel Q సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్’ అనే సంస్థ పేరుతో రంగంలోకి దిగిన ఈ ముఠా, సుమారు 452 మంది అభ్యర్థుల నుంచి దాదాపు రూ. 5 కోట్ల వరకు వసూలు చేసింది. మాదాపూర్ పోలీసులు పక్కా నిఘా పెట్టి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ పది మంది సభ్యుల ముఠా, నిరుద్యోగులకు గాలం వేసింది. శిక్షణ , ప్లేస్‌మెంట్స్ ఇప్పిస్తామని నమ్మించి, ఒక్కొక్క అభ్యర్థి నుంచి వారి అవసరాన్ని బట్టి రూ. 80 వేల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేశారు. అభ్యర్థులకు నమ్మకం కలిగించడం కోసం ప్రారంభంలో కొందరికి జీతాలు కూడా చెల్లించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా బోర్డు తిప్పేసి పరారయ్యేవారు.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..
ఒక సంస్థపై నిఘా పెరుగుతోందని గమనించిన ఈ ముఠా, ఇటీవల ‘MU సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్’ అనే మరో కొత్త పేరుతో సంస్థను ప్రారంభించి మళ్లీ మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించింది. అయితే, బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు ఎరుకల మహేష్ (32) తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!
ఈ ముఠాపై గతంలోనే మాదాపూర్ , KPHB పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఒక కారు, స్కూటీ, మొబైల్ ఫోన్లు, కంపెనీ స్టాంపులు , బ్యాంక్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలించారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కంపెనీల పూర్వాపరాలను పరిశీలించకుండా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!