US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..
- చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..
- రెండు డిమాండ్లు అంగీకరిస్తేనే చర్చలంటూ మెలిక..
- లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు ఆగాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు శనివారం నుంచి జరగబోతున్నాయి. అయితే, చర్చలకు కొన్ని గంటల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ముందుగా కొన్ని తమ షరతులు నెరవేర్చితేనే చర్చల్లో పాల్గొంటామని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ మాట్లాడుతూ.. కాల్పుల విరణమను లెబనాన్‌కు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ ఆస్తుల్ని వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అయితే, ఈ రెండు షరతులు నెరవేరితేనే చర్చలు ప్రారంభమవుతాయని అన్నారు.
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
ఈ కాల్పుల విరణమ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు ఆగాలని డిమాండ్ చేశారు. లెబనాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమని చెప్పారు. ఇజ్రాయిల్ దాడులు ఆగకుంటే మొత్తం శాంతి ప్రక్రియ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. మరోవైపు, ఇరాన్ నుంచి ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్ వెళ్లకపోవడం గమనార్హం.
చర్చల ప్రక్రియ ముందు కఠినమైన డిమాండ్లను ఇరాన్ తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ బ్యాంకింగ్, ఇంధర రంగాలపై అమెరికా ఆంక్షల కారణంగా చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చిన బిలియన్ డాలర్లను ఇరాన్ పొందలేకపోయింది. ఇప్పుడు వాటిని చర్చలకు ముందే రిలీజ్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. లేదంటే చర్చలు జరుగవని తేల్చి చెబుతోంది. మరోవైపు, పాక్ లో జరిగే చర్చలకు ఇరాన్ ప్రభుత్వంలోని ఒక వర్గం వెళ్లాలని భావిస్తుంటే, మరో వర్గం లెబనాన్‌పై దాడులు ఆగితేనే చర్చల ప్రక్రియ ముందుకు వెళ్తుందని చెబుతోంది. దీంతో ఇరాన్ ప్రభుత్వంలోనే చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది.
తాజావార్తలు
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!