నేతలు హైదరాబాద్‌ను వదలండి… సొంత ప్రాంతాలకు వెళ్ళండి అంటూ బీజేపీ నేతలతో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. హైదరాబాద్ లో ఉండి పార్టీ పని నడిపిస్త అంటే కుదరదని, జిల్లా అధ్యక్షులు జిల్లాల్లోనే ఉండాలి… ఎవరైతే ఉండలేరో రాజీనామా చేయండని ఆయన వెల్లడించారు. పార్టీలో చేరికలు ఉంటాయి.. మేము నలుగురమే ఉంటాము అంటే నడవదన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని విస్తరించండని, పార్టీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన వ్యాఖ్యానించారు.…