Dr. Laxman: సీఈసీ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లిస్టు తో పాటు తెలంగాణ లిస్టు కూడా ఫైనల్ చేస్తామని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగుతుందన్నారు. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నాట్లు తెలిపారు. సీఈసీలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లిస్టు తో పాటు తెలంగాణ లిస్టు కూడా ఫైనల్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ అభ్యర్థుల జాబితా పై పూర్తిస్థాయి కసరత్తు జరిగిందన్నారు. గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.
బీసీ ఎజెండాతో తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతామన్నారు. ఇతర అన్ని పార్టీలు బీసీలను ఓటు యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే మించి బీసీలకు టికెట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఏ అవకాశం అయినా బీజేపీ లోనే సాధ్యమవుతుందన్నారు. ఎంపీలు సైతం పోటీ చేసే అంశం పైన చర్చలు సాగుతున్నాయని, గెలుపు గుర్రాలే మా ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గురువారం సమావేశమయ్యారు. అనేక సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధాన నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా సీట్ల కేటాయింపు, మెజారిటీ ప్రజలు టికెట్ ఆశిస్తున్న స్థానాలు… వీటిపై చర్చ జరిగింది. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పలుమార్లు కలిశారు. ఈ సమావేశాల అనంతరం గురువారం రాత్రి నడ్డా నివాసంలో కమిటీ మరోసారి సమావేశమైన విషయం తెలిసిందే..
Shriya Saran: కావాల్సిన చోట చూపిస్తూ.. అవసరం లేని చోటు కవర్ చేస్తూ శ్రియ.. నీ డ్రస్ అదుర్స్