మన సమాజంలో ఇతరుల్ని మాయ మాటలతో మోసగించడం చాలా తేలిక. అందులోనూ మంచి ఉద్యోగం పేరు చెబితే ఎలాంటి వారైనా బుట్టలో పడిపోతారు. ఓ లేడీ అలాగే చేసింది. వందలమందిని అడ్డంగా ముంచేసింది. ఆ లేడీ పెద్ద కిలాడి…మీకు ఎటువంటి పరీక్షలు లేకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకుండా స్వయంగా కేంద్ర ప్రభుత్వంలో పర్మినెంట్ ఉద్యోగం కావాలా..?? మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ప్రతి నెల 25వేలు మీ ఖాతాలో జమ అవుతాయి. మీరు చేయాల్సిందల్లా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేవరకు ఆ లేడీ తో టచ్ లో ఉండడమే.
అసలు ఎవరు ఆ కిలాడి లేడీ.. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేవరకు చేయాల్సింది ఏమిటి?. ఆ లేడీని కిలాడి అంటున్నది ఎందుకు..?? కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న చదువుకున్నా యువకులకు ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు, ప్రభుత్వంలో జరిగే లోపాలను కొంతమంది కేటుగాళ్ళు ఆసరాగా చేసుకొని చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ క్యాష్ చేసుకుంటున్నారు, అలా మోసం చేసే విషయంలో కొద్దోగొప్పో చదువుకున్నవాళ్ళు కొంతమందైతే అసలు చదువుకోవడం తెలియని ఓ టైలరింగ్ చేసుకునే లేడీ టైలర్ ఉద్యోగాల పేరుతో చేసిన మోసం తెలిస్తే షాకవ్వాల్సిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకట లక్ష్మీ అనే మహిళ నాణేనికి రెండు వైపులా అన్నట్టు టైలరింగ్ చేయడం వృత్తి. దీనికి మరో వైపు ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలను కొట్టేసింది. చదువుకున్న యువకులను మాయమాటలతో నమ్మించి రెండు రాష్ట్రాల్లో యువత నుండి భారీగా డబ్బులు వసూలు చేసిందంటూ ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగ్గట్టు పశ్చిమగోదావరి జిల్లా రామసింగారం గ్రామానికి చెందిన సత్య శ్రీ అనే డిగ్రీ విద్యార్థి నుండి, దేవరపల్లి కి చెందిన నరేష్ అనే యువకుడు వద్ద నుండి అయిదు లక్షల రూపాయలను వెంకట లక్ష్మి వసూలు చేసింది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేసింది. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పై ఇద్దరి వద్ద నుండి 5 లక్షలు తీసుకుంది. దీంతో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో సత్య శ్రీ, నరేష్ ఇద్దరు కంప్లైంట్ చేశారు. వెంకట లక్ష్మి అనే మహిళ అశ్వారావుపేట పట్టణంలో టైలరింగ్ నిర్వహిస్తూ అందరితో మంచిగా ఉంటూ బంధువులు ఫంక్షన్లలో నేను ఉద్యోగం చేస్తున్నానని నమ్మించంది. వారి దగ్గర్నించి ఉద్యోగాల పేరుతో డబ్బులు భారీగా వసూలు చేసిందని సత్య శ్రీ నరేష్ ఆరోపిస్తున్నారు. గత రెండు సంవత్సరాలు క్రితం నరేష్ సత్య శ్రీ ఇద్దరు కలిపి వెంకట లక్ష్మి కి 5 లక్షలు ఇవ్వగా మీకు ఉద్యోగుల వచ్చాయి అంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ను స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ పేరుతో గెజిటెడ్ సంతకం చేసి ఇచ్చింది.
Read Also: Dengue Danger in Kakinada: కాకినాడలో డెంగీ, టైఫాయిడ్ డేంజర్ బెల్స్
అలా నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే కాకుండా డ్యూటీ చేయాల్సిన ప్రదేశం అంటూ పశ్చిమగోదావరి జిల్లాలో పాడుబడిన భవనాల వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీరు అక్కడే డ్యూటీ చేయమని చెప్పింది. గత 7 నెలలు నుండి అలా పాడు పడ్డ భవనాల వద్ద సత్య శ్రీ అలానే నరేష్ ని నకిలీ డ్యూటీ చేయించింది. జీతాలు రావడం లేదని వెంకటలక్ష్మిని నిలదీయడంతో ఇద్దరికి 20 వేల చొప్పున ఓ నెల జీతాన్ని వెంకట లక్ష్మీ వారి అకౌంట్లలో వేసింది. సత్య శ్రీ నరేష్ లకు అనుమానంతో అసలు వెంకట లక్ష్మీ ఏంటి అనేది తెలుసుకోగా మోసపోయామని గ్రహించుకున్నారు..మోసపోయిన సత్య శ్రీ నరేష్ తమ అమౌంట్ తమకి ఇవ్వాలని వెంకట లక్ష్మిపై వత్తిడి చేశారు. నేనివ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బాధితులను బెదిరించింది. ఈ కిలాడీ లేడీపై కేసు నమోదుచేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.