Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ladies Special Bus: హైదరాబాద్‌లోని మహిళా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే.. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు సంస్థ ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు, ఆఫర్లను తీసుకువస్తోంది. ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న ప్రాంతాల్లో.. వారి సౌకర్యార్థం మరిన్ని కొత్త సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో.. ఐటీ కారిడార్‌లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ తాజాగా లేడీస్ స్పెషల్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో కొత్త రూట్లో లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని నిర్ణయించింది. ఈసారి కోఠి-కొండాపూర్ రూట్‌లో లేడీస్ స్పెషల్ బస్సును నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 127కే నంబర్‌తో మహిళా ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు.
మహిళా ప్రయాణికులకు శుభవార్త. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్,… pic.twitter.com/EhpJg85VUb
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 18, 2023
ఈ మహిళా ప్రత్యేక బస్సు ప్రతిరోజూ ఉదయం 8.50 గంటలకు కోఠి నుండి బయలుదేరుతుంది. బస్సు లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్ రోడ్డు మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది. మళ్లీ.. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో మహిళా ప్రయాణికులను కోఠికి తీసుకువస్తారు. కాగా, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ గమ్యస్థానాలకు క్షేమంగా, సురక్షితంగా చేరుకోవాలని TSRTC సంస్థ మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. నగరంలోని ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం జూలై 31న టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ బస్సును ప్రారంభించింది. ఈ ప్రత్యేక బస్సు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక సమయాల్లో JNTU నుండి వేవ్ రాక్ వరకు తిరుగుతుంది. కాగా, మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో మరికొన్ని మహిళా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు కోఠి-కొండాపూర్ మార్గంలో మరో బస్సును ప్రారంభించనున్నారు.
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!