KVP Ramachandra Rao : పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్న భట్టి విక్రమార్కను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన పాదయాత్ర తరహాలోనే తెలంగాణలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందన్నారు.
Also Read : IPL 2023 : దూకుడుగా ఆడుతున్న సీఎస్కే.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
Also Read
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలన, ప్రజా వ్యతిరేక పాలన గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు విడమర్చి చెప్పడంతో పాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంశాలను భట్టి విక్రమార్క ప్రజలకు పాదయాత్రలో వివరిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను పాదయాత్రలో తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపై చేసి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తరహాలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో పోడు భూములు, ధరణి సమస్యలతో ఎదుర్కొంటున్న రైతుల ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా గట్టిగా చెబుతున్నారని అన్నారు.
Also Read : Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
అనేక రకాల సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కారిస్తామన్న భరోసా ప్రజల్లో కల్పిస్తున్నాడని చెప్పారు. అభిమాన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న భట్టి విక్రమార్క అనేక అనుభవాలను నేర్చుకున్నారని, తాను చేపట్టిన పాదయాత్రకు అవి ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నానని అన్నారు. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఇదే మే 18న డాక్టర్ వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు కూడా భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అదే రోజు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారని గుర్తు చే20 సంవత్సరాల క్రితం వైయస్సార్ పాదయాత్ర చేసిన సమయంలో అస్వస్థతకు గురైన రోజునే భట్టి విక్రమార్క స్వల్ప ఆస్వస్థత చెందడం యాదృచ్ఛికంగా జరిగిందన్నారు.
ఏఐసీసీఅధ్యక్షులు ఖర్గే ఆశీస్సులు, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తోడ్పాటు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహకారం, కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతం కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తుందని ఆశించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!