ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం రేసులో నిలిచింది. ఈ మ్యాచ్ లో ధోని సేన విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండానే ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం మిగిలిన జట్ల ఫలితాలపై సీఎస్కే టీమ్ ఆధారపడాల్సి ఉంటుంది.
Also Read : Police Complaint : ప్రేమించి మోసం చేశాడు.. ఎస్ఐపై యువతి పోలీస్ కంప్లైంట్
కీలక మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్లుగా దూకుడుగా ఆడుతున్నారు. పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వికెట్ నష్టపోకుండా.. హాఫ్ సెంచరీ మార్క్ ను దాటింది. ప్రస్తుతం చెన్నై టీమ్ 10 ఓవర్లకు అజేయంగా 87 పరుగులు చేసింది. క్రీజులో సీఎస్కే ఓపెనర్లు రుత్ రాజ్ గైక్వాడ్ ( 37 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు ) హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేస్తున్నారు.
Also Read : Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలర్లను మార్చుతున్నా ఫలితం మాత్రం రావడం లేదు.. దీంతో సీఎస్కే స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తుండంతో సీఎస్కే అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. వికెట్ల కోసం ఢిల్లీ బౌలర్లు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం సీఎస్కే స్కోర్ వికెట్ నష్టపోకుండా.. 12 ఓవర్లకు 117 పరుగులు చేసింది. క్రీజులో రుత్ రాజ్ గైక్వాడ్ ( 71 ), డేవాన్ కాన్వే ( 45 ) ఉన్నారు.
