గవర్నర్ తమిలి సై పై సీపీఐ సెక్రెటరీ కూనంనేని సాంబ శివరావు మండిపడ్డారు. హైదరాబాద్ లోని మగ్ధుం భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ఎంత మేరకు ఉండాలో ఎంత మేరకే ఉండాలన్నారు. ఇది విమోచనో, విలీనమో గవర్నర్ కి ఎందుకు? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని అన్నారు. గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికిరాదని విమర్శించారు.
సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా డిక్లేర్ చేయాలని డిమాండ్‌చేశారు. సమైక్యత దినం అనడం కేసీఆర్ చేస్తున్న తప్పు అని అన్నారు. 1947 సెప్టెంబర్ 11న సాయుధపోరాటం మొదలైందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చినా సమస్యలు పరిష్కారం కానందుకే సాయుధపోరాటం మొదలైందని అన్నారు. సాయుధపోరాటం ద్వారా కమ్యూనిస్టులు మూడువేల గ్రామాలు విముక్తి చేశారని తెలిపారు. సాయుధపోరాటం జరిగింది భూ స్వాములకు వ్యతిరేకంగానే అని అన్నారు. సాయుధపోరాటం వల్లే నిజాం లొంగిపోయి పటేల్ తో మ్యాచ్ ఫిక్స్ చేసుకొన్నారని గుర్తు చేశారు. ఫ్యూడల్ సమాజంపై భాదితులు చేసినదే సాయుధపోరాటం అని అన్నారు. అప్పటి ఫ్యూడల్ సిస్టం లీడర్ నిజాం అని తెలిపారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చెప్పేది అబద్దమని మండిపడ్డారు. ముస్లిం పాలకుల నుండి హిందువులకు విముక్తి లభించింది అనడం దుర్మార్గమన్నారు. నిజాం రాజు వేరు, ముస్లిం ప్రజలు వేరని పేర్కొన్నారు. సాయుధపోరాటం చేసింది 90 శాతం మంది హిందువులపైనే, ప్రజలని విడగొట్టే వాళ్ళెవరూ దేశభక్తులు కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకీ సెప్టెంబర్ 17తో సంబంధమే లేదని అని అన్నారు. ఖాసిం రజ్వీని ఎందుకు వదిలిపెట్టి పాకిస్థాన్ వెళ్లేలా అవకాశం ఇచ్చారో బీజేపీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విమోచన కల్గితే అప్పటి దాకా ఇబ్బంది పెట్టినవాళ్ళని జైల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు దేశభక్తులు కాదు, సమాజాన్ని అని గవర్నర్ తన పని తాను చూసుకోవాలని అన్నారు.
సమైక్యత, సమగ్రత దినం అని గందరగోళం ఎందుకు? అని ప్రశ్నించారు. రేపటి నుండి సాయుధపోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సెప్టెంబరు 17న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున విలీన దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాల్లో తెలంగాణ సాయుధపోరాట అమరులను స్మరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూనంనేని సాంబ శివరావు, సీపీఐ తెలంగాణ సెక్రెటరీ ఈ సందర్భంగా వెల్లడించారు.
Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..