కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్ లేఖ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ లకు కేంద్రం అండగా నిలవాలి అని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు అందించాల్సిన సహాయక చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరోనా పైన పరిమితులు సడలించడం, పెరుగుతున్న ఎకనామిక్ ఆక్టివిటీ మొదలైన అంశాల కారణంగా నాలుగవ త్రైమాసికంలో ఎంఎస్ఎంఈ పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలంటే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు అవసరమని కేటీఆర్ తెలిపారు. గత ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయన్నారు. కరోనా, లాక్డౌన్ వలన ఈ ఎంఎస్ఎంఈ లు గత ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాయని, దీంతో వాటి యొక్క పరిస్థితి దీనంగా మారిందన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
పరిశ్రమల కార్యకలాపాల పైన లాక్డౌన్ సమయంలోనూ తెలంగాణ ఇలాంటి పరిమితులు విధించలేదని అయితే ఈ ఎంఎస్ఎంఈ లకు అవసరమైన ముడి సరుకుల సరఫరా ఇతర రాష్ట్రాల నుంచి సరైన సమయంలో అందకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు తిరిగి వెళ్ళిపోవడం, ఎం ఎస్ ఎం ఈ లు తయారు చేసిన తమ ఉత్పత్తులను తన కస్టమర్లకు అందించడంలో ఎదుర్కొన్న రవాణా ఇబ్బందుల వంటి కారణాల వలన వాటి కార్యకలాపాలు స్తంభించిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
ఇలా ఎలాంటి రాబడులు లేని సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈ ల రుణాల చెల్లింపు పైన వచ్చే ఏడాది మార్చి 31 వరకు మారటోరియం విధించడం, అప్పటిదాకా రుణాల పైన వడ్డీని ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకుంటే ఆయా ఎంఎస్ఎంఈలకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి మద్దతు అందించగలిగితే కరోనా కన్నా ముందు ఉన్న పూర్వస్థితికి ఎంఎస్ఎంఈలు చేరుకుంటాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచిస్తున్న ఈ సహాయక చర్యలు వెంటనే చేపట్టాల్సిందిగా మంత్రి కేటీఆర్ నిర్మల సీతారామన్ కి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!