KTR : తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు
- వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి పోటీ చేయరు
- రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే, కొడంగల్‌కు సీఎం తిరుపతిరెడ్డి
- వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నాయకుల జాయినింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ ప్రజల జోష్ చూస్తుంటే మామూలుగా లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ, కొడంగల్‌కు సీఎం తిరుపతి రెడ్డి అని ఆయన సెటైర్ వేశారు. ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిలర్ కూడా కాని ఆయనకు అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు.
Also Read
- Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
- TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
- Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
కొడంగల్ భూములను తొండలు గుడ్లు పెట్టని భూములు అని రేవంత్ రెడ్డి అన్నాడని, అలాంటి మాటలు మాట్లాడిన ఆయనకు ప్రజలు సరైన సమాధానం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని గుర్తు చేస్తూ, “ఇక్కడ మీరు ఒక్క ఎంపీటీసీ కూడా గెలిపించకపోతే ఢిల్లీ లెవల్లో తెలుస్తుంది” అన్నారు. అంతేకాకుండా.. “మనమే కట్టిన ప్రాజెక్టులు, మనమే చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ మనకు చాలా బాకీ పడింది. ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించండి, వారి మోసాన్ని తిరిగి చూపించండి” అని అన్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన వరదలపై కూడా కేటీఆర్ ఆరోపణలు చేశారు. “హైదరాబాద్‌లో భారీ వర్షం వచ్చినా ఏమి కాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను పూర్వం కట్టారు. వాతావరణ శాఖ క్లౌడ్‌బరస్ట్ హెచ్చరించినా ఆ రెండు చెరువులను నింపి ఉంచారు. కావాలనే ఒక్కసారిగా నీటిని వదిలి నగరాన్ని ముంచేశారు. మూసీ పక్కన ఉన్న వారిని ఖాళీ చేయించేందుకే ఈ ప్లాన్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసమే నీళ్లు వదిలారు” అని కేటీఆర్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!