KTR : హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయి, ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సిన భూములను కాంగ్రెస్ నేతలు స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆరోపణలు చేశారు.
కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో, “రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు, మీర్‌ఖాన్‌పేట లేఅవుట్‌లో పొజిషన్ ఇవ్వడమైతే ఫలించలేదు,” అని గుర్తు చేశారు.
War 2: హృతిక్, ఎన్టీఆర్‌లతో విడివిడిగా ప్రమోషన్స్?
అయితే వాస్తవంగా జరుగుతున్నది ఏమిటంటే, రైతులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు తమ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతుల నుండి అతి తక్కువ ధరలకు భూములు బలవంతంగా తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా చేశారు.
“రాష్ట్ర అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతన్నలను వదలకుండా, నష్టపరిహారంగా ఇచ్చే భూముల్ని కూడా దోచుకుంటున్న తీరు సిగ్గుచేటు,” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ మండిపడ్డారు.
Dil Raju : నెగెటివ్ ట్రోలింగ్‌కు చెక్.. మంచు విష్ణు మార్గాన్ని ఫాలో అవుతున్న దిల్ రాజు”