Site icon NTV Telugu

KTR : ఫార్ములా ఈ-కార్‌ కేసు లొట్టపీసు కేసు.. స్కాం లేదు.. మన్నూ లేదు

Ktr Cae

Ktr Cae

KTR : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు ‘లొట్టపీసు కేసు’ అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు. ఒకవేళ అవకతవకలు జరిగాయని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణ గురించి ప్రస్తావిస్తూ, “దూద్ కా దూద్, పానీ కా పానీ అవ్వాలి” అని, ఇందులో ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. “స్కాం లేదు, మన్నూ లేదు” అని ఆయన అన్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా సిద్ధమని సవాల్ విసిరారు.

CM Revanth Reddy : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించాలని అశోక్ నగర్‌లో చెప్పిన మాటలను నమ్మి ఓటు వేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో 500 పోస్టులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన వెంటనే పరీక్షను రద్దు చేశామని, కానీ కాంగ్రెస్ హడావుడిగా పరీక్ష నిర్వహించిందని అన్నారు. ఇందులో అవకతవకలు జరిగాయని, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని, కోర్టుకు వెళ్లిన అభ్యర్థులకు కోర్టు శుభవార్త వినిపించిందని ఆయన తెలిపారు. రీ-వాల్యుయేషన్ చేసినా న్యాయం జరగదని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, నిజం నిగ్గుతేల్చడానికి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కమిషన్ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఎం 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, మంత్రులు 70 వేలు, లక్ష అని వేర్వేరుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాలకు కూడా మళ్లీ ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చి తామే ఇచ్చామని చెబుతున్నారని విమర్శించారు. మొన్న అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలని అడిగితే కేవలం రెండు రోజులే పెట్టారని, మరోసారి అసెంబ్లీ నిర్వహించి ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించాలని కోరారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారని, నిరుద్యోగులను మళ్లీ కలిసింది లేదని, వారి గురించి ఆలోచించిందే లేదని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం స్పందించి రీ-ఎగ్జామ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటం చేస్తున్న యువతపై, అశోక్ నగర్‌లో ఆందోళన చేస్తున్న వారిపై పెట్టిన కేసులను బేషరతుగా విత్ డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చివరగా, “లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం” అని వ్యాఖ్యానిస్తూ, “లీకులు ఇచ్చి ఎన్ని రోజులు బ్రతుకుతారు” అని ప్రశ్నించారు.

Formula ERace : ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ నివేదిక.. కేటీఆర్‌తో సహా అధికారులపై ఛార్జ్‌షీట్ సిద్ధం..!

Exit mobile version