KTR : ఫార్ములా ఈ-కార్ కేసు లొట్టపీసు కేసు.. స్కాం లేదు.. మన్నూ లేదు
- ఫార్ములా ఈ-కార్ కేసుపై స్పందించిన కేటీఆర్
- ఫార్ములా ఈ-కార్ కేసు లొట్టపీసు కేసు
- దూద్ కా దూద్.. పానీ కా పానీ అవ్వాలి
- ఒక్కరూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదు
- స్కాం లేదు.. మన్నూ లేదు-కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు ‘లొట్టపీసు కేసు’ అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు. ఒకవేళ అవకతవకలు జరిగాయని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణ గురించి ప్రస్తావిస్తూ, “దూద్ కా దూద్, పానీ కా పానీ అవ్వాలి” అని, ఇందులో ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. “స్కాం లేదు, మన్నూ లేదు” అని ఆయన అన్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా సిద్ధమని సవాల్ విసిరారు.
CM Revanth Reddy : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ను ఓడించాలని అశోక్ నగర్లో చెప్పిన మాటలను నమ్మి ఓటు వేసిన ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో 500 పోస్టులు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన వెంటనే పరీక్షను రద్దు చేశామని, కానీ కాంగ్రెస్ హడావుడిగా పరీక్ష నిర్వహించిందని అన్నారు. ఇందులో అవకతవకలు జరిగాయని, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని, కోర్టుకు వెళ్లిన అభ్యర్థులకు కోర్టు శుభవార్త వినిపించిందని ఆయన తెలిపారు. రీ-వాల్యుయేషన్ చేసినా న్యాయం జరగదని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, నిజం నిగ్గుతేల్చడానికి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కమిషన్ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, మంత్రులు 70 వేలు, లక్ష అని వేర్వేరుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాలకు కూడా మళ్లీ ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చి తామే ఇచ్చామని చెబుతున్నారని విమర్శించారు. మొన్న అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలని అడిగితే కేవలం రెండు రోజులే పెట్టారని, మరోసారి అసెంబ్లీ నిర్వహించి ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించాలని కోరారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారని, నిరుద్యోగులను మళ్లీ కలిసింది లేదని, వారి గురించి ఆలోచించిందే లేదని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం స్పందించి రీ-ఎగ్జామ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటం చేస్తున్న యువతపై, అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న వారిపై పెట్టిన కేసులను బేషరతుగా విత్ డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చివరగా, “లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం” అని వ్యాఖ్యానిస్తూ, “లీకులు ఇచ్చి ఎన్ని రోజులు బ్రతుకుతారు” అని ప్రశ్నించారు.
Formula ERace : ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ నివేదిక.. కేటీఆర్‌తో సహా అధికారులపై ఛార్జ్‌షీట్ సిద్ధం..!
తాజావార్తలు
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?