KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్‌లైన్..
- రైతు ధర్నాలో కేటీఆర్ ఫైర్
- కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
- సాగర్‌లో నీళ్లున్నా విడుదల చేయరా?
- షెడ్యూల్ రాకపోతే పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనకు దిగారు. నాగార్జునసాగర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ NSP గ్రౌండ్లో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన ప్రారంభమై వెయ్యి రోజులు అవుతున్నాయని, ఈ కాలంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేసిందని ఆరోపించారు. అయినప్పటికీ వేలాది మంది రైతులు తరలివచ్చి తమకు మద్దతుగా నిలిచారని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. ఆ సమయంలో రైతులు ధీమాగా బతికారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, రైతుబంధు, రైతుబీమా పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పిన విషయాలే ఇప్పుడు నిజమవుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి రైతులకు మూడుసార్లు రైతుబంధు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రుణమాఫీ కూడా సంపూర్ణంగా జరగలేదని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడుగుతామని, నిలదీస్తామని స్పష్టం చేశారు. సాగునీటి విడుదలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాకు శనిలా దాపురించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో శ్రీశైలం నీటిమట్టం 875 అడుగులకు చేరగానే సాగర్‌కు నీటిని విడుదల చేయించామని గుర్తుచేశారు.
ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సరిపడా నాగార్జునసాగర్‌లో నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఎడమ కాలువ ఆయకట్టు రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎడమ కాలువ ఆయకట్టు ప్రజలపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మిగులు జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ అన్నారు. వెలిగొండ నుంచి నీళ్లు వెళ్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెలిగొండకు నీళ్లు తరలించడం గురుదక్షిణగా మారిందని, ముఖ్యమంత్రి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు చేసిన కేటీఆర్.. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వినాయక చవితిలోగా సాగునీటి విడుదల షెడ్యూల్ ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. పది రోజుల్లోగా షెడ్యూల్ రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!