Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ భార్య తనను ఎగతాళి చేస్తోందని, ఆ కారణంతో తనకు విడాకులు ఇప్పించాలంటూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే, ఈ కారణం విడాకులు ఇవ్వడానికి ఎంతమాత్రం సరిపోదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేస్తూ ఆ భర్త పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ పార్థ్ ప్రతీమ్ సాహూ, జస్టిస్ సచిన్ సింగ్ రాజ్‌పుత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వివాహంపై కీలక తీర్పు ఇచ్చింది. అంతకుముందు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ, విడాకులు నిరాకరించడంతో పాటు భార్యకు చెందిన ‘స్త్రీధన్’ (పుట్టింటివారు ఇచ్చిన ఆస్తులు, కానుకలు)ను ఆమెకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని జాంగ్జీర్-చంపా జిల్లాకు చెందిన 28 ఏళ్ల అక్ష ఘోష్‌కి, రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల పూజా సీత్కి 2019 మార్చి 7న వివాహమైంది. పెళ్లయ్యాక కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఆమె అత్తవారింట్లో ఉంది. ఆ సమయంలో భార్య తన పట్ల శత్రువులా ప్రవర్తించేదని, అబద్ధపు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించేదని భర్త ఆరోపించాడు. పైగా తను లావుగా, నల్లగా ఉన్నానంటూ హేళన చేసేదని, చెప్పాచేయకుండా రాజస్థాన్‌లోని ఓ బంధువుల పెళ్లికి వెళ్లి 25 రోజుల తర్వాత తిరిగొచ్చిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమెకు కవల పిల్లల గర్భస్రావం అయిందని, దానికి తనతో చెప్పకుండా రాజస్థాన్ వెళ్లడమే కారణమని ఆరోపించాడు. ఆపై ఆమె తల్లి వచ్చి రాయ్‌గఢ్ తీసుకెళ్లిపోయిందని, ఎంత బతిమిలాడినా తిరిగొచ్చేందుకు ఒప్పుకోలేదని భర్త కోర్టుకు తెలిపాడు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
అయితే భార్య పూజ ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించింది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందనే విషయం తెలిసి తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఆ తర్వాతే అతడు విచ్చలవిడిగా తాగుడుకు బానిసయ్యాడని ఎదురుదాడికి దిగింది. గర్భవతిగా ఉన్న సమయంలో తనను సరిగ్గా పట్టించుకోలేదని, అనారోగ్యానికి గురైతే తన తల్లి వచ్చి ఆసుపత్రిలో చేర్పించిందని తెలిపింది. కోలుకున్నాక తనను తీసుకెళ్లమని ఎంత అడిగినా భర్త, అతని ఇంట్లోవాళ్లు పట్టించుకోకపోవడంతోనే తన తల్లి రాయ్‌గఢ్ ఎస్పీకి ఫిర్యాదు చేసిందని వివరించింది. అంతేకాకుండా భర్త, అతని కుటుంబంపై గృహహింస కేసు కూడా పెట్టింది.
ఈ వివాదంపై ఫ్యామిలీ కోర్టు 2024 ఆగస్టు 28న భర్త విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ, స్త్రీధనాన్ని భార్యకు తిరిగివ్వాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భర్త అక్ష ఘోష్ హైకోర్టును ఆశ్రయించాడు. జూన్ 25న వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి, సెప్టెంబర్ 18న తుది తీర్పు వెలువరించింది. భర్త మోపిన క్రూరత్వం, భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందన్న ఆరోపణలకు ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. భార్య సరైన కారణం లేకుండానే పుట్టింట్లో ఉంటోందనే విషయాన్ని కూడా భర్త నిరూపించలేకపోయాడని పేర్కొంది. భర్త నల్లగా, లావుగా ఉన్నాడని అనడం విడాకులు ఇవ్వడానికి సరిపోయేంత పెద్ద కారణం కాదని తేల్చిచెప్పిన హైకోర్టు, ఎలాంటి కోర్టు ఖర్చులు విధించకుండా ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!