Minister KTR: వడ్డీ లేకుండానే హోమ్ లోన్లు..! కేటీఆర్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద పార్టీలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల మేనిఫెస్టోలు వచ్చేశాయి, ఓటింగ్ ప్రక్రియకు సమయం కూడా దగ్గరపడుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే ఆరు హామీలతో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసింది. అన్ని వర్గాలను ఆకర్షించే దిశగా అడుగులు వేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పలు హామీలను ప్రకటించినప్పటికీ… కొన్ని కీలక ప్రకటనలు చేస్తోంది. తాజాగా ఆటో వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు మినహాయిస్తున్నట్లు ప్రకటించగా… తాజాగా మరో ప్రకటన చేశారు కేటీఆర్. హెచ్ఐసీసీలో క్రెడాయ్ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ఇల్లు కొనాలనుకునే వారి కోసం కొత్త పథకాన్ని రూపొందించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందరికీ ఇళ్లు అనే నినాదానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
Read also: Telangana Elections 2023: రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు.. మోడీ, అమిత్‌షా, యోగీ, జేపీ నడ్డా ప్రచారం
Also Read
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
అయితే ప్రస్తుతం డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి పథకాలు అలాగే ఉంటాయని, కొత్త ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రుణం తీసుకుని ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో, ఓటింగ్ ప్రక్రియ నవంబర్ 30న మాత్రమే ఉంటుంది. ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో… అధికార బీఆర్ఎస్ నుంచి కీలక ప్రకటనలు వస్తాయా అనే చర్చ కూడా సాగుతోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మరిన్ని అంశాలు చేరుస్తాయనే చర్చ మొన్నటి వరకు జరిగినా…అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఆలోచించాలని నేతలు ప్రకటనలు చేస్తూ ప్రజలను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
KTR Metro: మెట్రో రైలులో కేటీఆర్ సందడి.. రాయదుర్గం నుంచి బేగంపేట వరకు ప్రయాణం
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!