KTR : ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు.. మహామహులనే ప్రజలు ఓడించారు..!
- సీఎం రేవంత్ శైలిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- మహామహులనైనా ప్రజలు ఓడించారన్న ఉదాహరణలు
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాజీనామా సవాల్
- మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి శైలిని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను తాను ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని విర్రవీగుతున్నారని, చరిత్రలో ఇలాంటి వారు ఎందరో వచ్చారని ఆయన మండిపడ్డారు.
ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి మహామహులనే ప్రజలు ఓడించారని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వారు గాలిలో కలిసిపోయారే తప్ప దేశం, ప్రజల చైతన్యం మాత్రం అలాగే ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కేటీఆర్ రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. “మీ ప్రభుత్వం మీద మీకు అంత నమ్మకం ఉంటే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండి” అని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచినట్లు గొప్పలు చెప్పుకోవడం కాదని, రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపాలని సవాల్ విసిరారు. ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితేనే అది నిజమైన ప్రజాభిప్రాయానికి కొలమానం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత మున్సిపల్ ఫలితాలను విశ్లేషిస్తూ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 130 మున్సిపాలిటీలకు గాను 122 గెలిచామని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా 116 స్థానాల్లో 15-16 చోట్లలో బీఆర్ఎస్ గెలిచిందని, దాదాపు 30 చోట్ల హంగ్ ఏర్పడిందని వివరించారు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, ప్రజల పక్షాన పోరాడుతున్నందునే బీఆర్ఎస్కు మద్దతు లభిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Flat 31% Discount : భారతదేశపు మొట్టమొదటి అడాప్టివ్ వాటర్ ప్యూరిఫైయర్పై భారీ డీల్..!
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్‌పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!