Krishna Kishore Reddy Reveals Shocking Secrets About Drugs Supply: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణ కిశోర్ రెడ్డి.. తాజాగా విచారణలో భాగంగా షాకింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. తనకు డ్రగ్స్ ఎలా అలవాటైంది? డ్రగ్స్ పెడ్లర్స్‌తో సంబంధాలెలా ఏర్పడ్డాయన్న విషయాలను రివీల్ చేశాడు. తనకు స్నేహితుల ద్వారా డ్రగ్స్ అలవాటు అయ్యిందని.. గోవా, బెంగళూరు, ముంబైకు వెళ్లినప్పుడు తాము తరచూ డ్రగ్స్ తీసుకునేవాళ్లమని చెప్పాడు. ప్రతి బిజినెస్ పార్టీలోనూ డ్రగ్స్ తప్పకుండా తీసుకునేవాడినని తెలిపాడు. ఈ అలవాటుతోనే తనకు డ్రగ్స్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయన్నాడు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చే వాళ్లతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయని.. వాళ్ల ద్వారానే నేరుగా డ్రగ్స్ తెప్పించుకునేవాడినని పేర్కొన్నాడు.
IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..
ఫార్మ్ హౌస్, పబ్బుల్లో చాలాసార్లు స్నేహితులకు డ్రగ్స్ పార్టీ ఇచ్చానని కృష్ణ కిశోర్ ఒప్పుకున్నాడు. కొన్ని సందర్భాల్లో రేవ్ పార్టీలను కూడా నిర్వహించానన్నాడు. పార్టీల్లో డీజేల కోసం మోహిత్ అగర్వాల్ కాంటాక్ట్ చేశాడని, అతడు డిజే ప్లేయర్స్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేశాడని కుండబద్దలు కొట్టాడు. బిజినెస్, రేవ్ పార్టీల కోసం తాను డ్రగ్స్ తెప్పించేవాడినని.. లగ్జరీ బస్సుల్లో పార్శెల్ ద్వారా డ్రగ్స్ తెప్పించానని వెల్లడించాడు. పచ్చళ్ళు, ఎనర్జీ ఫుడ్స్ మధ్యలో డ్రగ్ పెట్టి.. తనకు పార్శెల్ పంపించేవాళ్లని అన్నాడు. డ్రగ్స్ సహా.. డ్రైవర్స్, బస్ నెంబర్స్, బస్ ఫోటోలను తనకు షేర్ చేసేవాళ్లన్నాడు. తన దగ్గర పని చేసే సిబ్బందిని పంపించి.. డ్రగ్స్‌తో నిండిన పచ్చళ్లు, ఎనర్జీ ఫుడ్ డబ్బాలను తెప్పించుకునేవాడినని తెలిపాడు. ఇతర రాష్ట్రాల నుంచి కస్టమర్లకు డ్రగ్స్ పక్కాగా చేరుతుందని కృష్ణ కిశోర్ స్పష్టం చేశాడు.
Sreeja Konidela: 2022లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. కొత్త జర్నీ ప్రారంభమైంది
కాగా.. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు, ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ ఎడ్విన్ అరెస్ట్‌లో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒకరు హీరోయిన్ నేహా దేశ్‌పాండే భర్త మైరాన్ మోహిత్ కాగా, మరొకరు ఈ వ్యాపారవేత్త కృష్ణ కిశోర్ రెడ్డి. ఎడ్విన్, మైరాన్‌తో పరిచయాలు పెంచుకున్న కృష్ణ కిషోర్.. వారి సాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. చివరికి ఇతడ్ని రెండు గ్రాముల కొకైన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి