Koti Deepotsavam 2023 Day 6: భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా కోటి దీపోత్సవం విజయవంతంగా సాగుతోంది.. కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేలాది మంది ఒకేచోట చేరి.. దీపాలు వెలిగిస్తే.. అది దీపయజ్ఞం అవుతుంది.. అదే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం అవుతుంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసంగా మారిపోయింది.. ఇప్పటికే ఐదు రోజుల పాటు నిర్వహించిన విశేష కార్యక్రమాలు కలుపండుగా సాగాయి.. ఇవాల ఆరవ రోజు కోటిదీపోత్సవ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఆరవ రోజు కోటి దీప యజ్ఞం వేదికగా సాగే వివేష కార్యక్రమాలు ఇవే..
ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలకు తోడు సాంస్కృతి కార్యక్రమాలు కన్నుల పండుగా సాగనున్నాయి.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న దీపయజ్ఞం.. కోటిదీపోత్సవంలో పాన్గొనేందుకు రండి.. తరలిరండి అని ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. భక్తులకు కావాల్సిన పూజా సామగ్రిని కూడా రచనా టెలివిజన్ ఉచితంగా అందజేస్తున్న విషయం విదితమే.. అదే విధంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా నగర శివారు ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది టీఎస్ఆర్టీసీ..