బీజేపీ లో భారీ చేరికలు మొదలయ్యాయి. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా.. అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా.. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయా.. అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తుంది. అయితే నేడు ఉద్యమ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. అందుకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈనేపథ్యంలో.. తాను బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రెస్మీట్ పెట్టి స్పష్టం చేసిన కొండా.. ఈ రోజు అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
read also: Hyderabad: మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. మూడు స్టేషన్‌లు మూసివేత
అయితే ఎవరి సమక్షంలో చేరతారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయిప్పటికి ప్రస్తుతం బీజేపీ అగ్ర నాయకులంతా తెలంగాణలోనే ఉన్నందున ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ముగ్గురిలో ఎవరో ఒకరు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత 2014లో చేవెళ్ల నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ఉద్యమ వ్యతిరేక విధానాలు నచ్చక 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈనేపథ్యంలో గతఏడాది మార్చిలో కాంగ్రెస్ లో నాయకత్వలోపం కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా.. ప్రస్తుతం బీజేపీలో చేరనున్నారు.