Hyderabad: మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. మూడు స్టేషన్‌లు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ విజయ సంకల్ప సభ భారీ స్థాయిలో జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభకు ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలో ఆశీనులు అవుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతో పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో అధికారులు కూడా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు.
Read Also: LIVE: హైదరాబాద్‌లో హీటెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, జేబీఎస్ మెట్రో స్టేషన్‌లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు. ఈ మూడు స్టేషన్‌లలో మెట్రో రైళ్లు ఆగకుండా వెళ్తాయని, ప్రయాణికులు గమనించాలని సూచించారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆయా మెట్రో స్టేషన్‌లను మూసివేస్తున్నట్లు వివరించారు. మిగిలిన స్టేషన్లలో సర్వీసులు యథాతథంగా నడుస్తాయంటూ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కాగా ఆదివారం నాడు నగరంలోని మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మవద్దని అభ్యర్థించారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!