కర్ణాటకలో ఫలితం ఏడాది క్రితమే ఊహించిందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్య విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగులను, రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ధాన్యాన్ని కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని, సోషల్ మీడియా వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నాతో కూడా చెప్పారని, మా పార్టీలోనే కొందరు సీనియర్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న చర్య సరైందేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Karnataka: కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్… సీఎం అభ్యర్థిని ఇంకా తేల్చలేదు..
ఇదిలా ఉంటే.. . నెల రోజుల క్రితం సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్న కోమటిరెడ్డి.. తెలంగాణ సీఎం అభ్యర్థిగా దళిత వ్యక్తిని ప్రకటించాలని డిమాండ్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా తాను చర్చించినట్లు అప్పట్లో కోమటిరెడ్డి తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే దళిత వ్యక్తిని సీఎం చేయాలని ఆయన కోరారు.
Also Read : Venugopala Krishna: పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయింది