Tiger Tension : కొమురంభీం జిల్లాలో పులి సంచారం స్థానికులలో భయాన్ని పెంచుతోంది. తాజాగా, తిర్యాని మండలంలో పులి దాడి జరిగింది. ఈ దాడిలో రెండు పశువులు చనిపోయాయి. గోండు గూడ, తోయగూడ గ్రామాలకు చెందిన ఆవుల మీద పులి దాడి చేసింది. కుర్పేత కర్ణ, మడావి అంజనా బాయి లకు చెందిన ఆవులపై ఈ దాడి జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలం పరిశీలించారు. పులి పాద ముద్రలు గుర్తించారు. పులి సంచారం దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. “గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి. అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దు” అని అటవీ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పులి కదలికలు తెలుసుకోవడానికి అటవీ సిబ్బంది ఆ ప్రాంతంలో గస్తీని పెంచారు. ఎవరికైనా పులి జాడ తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.