కోకాపేట.. అత్యధికంగా రూ.60.2 కోట్లు.. అత్యల్పంగా రూ.31.2 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… హెచ్ఎండీఏ భూములు వేలం వేయగా… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలకింది.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికినట్టు అయ్యింది.. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది.. దీంతో భూముల అమ్మకాల్లో కోకాపేట్ రికార్డు సృష్టించింది..
అత్యధికంగా ఎకరానికి రూ.60 కోట్లతో కొనుగోలు చేసింది రాజ పుష్ప రియాల్టీ… రూ.99 కోట్ల 33 లక్షలతో 1.65 ఎకరాల్ని కొనుగోలు చేశారు. ఇక, రూ.42.4 కోట్లతో మరో 7.7 ఎకరాలను సొంతం చేసుకుంది రాజ పుష్ప ప్రాపర్టీస్… రూ.42.2 కోట్లతో 7.7 రెండు ఎకరాలు సొంతం చేసుకున్నారు మన్నే సత్యనారాయణ రెడ్డి… అందరి కంటే తక్కువగా 31.2 కోట్లతో ఎకరాల స్థలాన్ని వేలంలో సొంతం చేసుకుంది హైమా డెవలపర్స్… మరోవైపు రూ.39.2 కోట్లకు ఎకరాల చొప్పున 8.9 ఎకరాలను సొంతం చేసుకుంది ఆక్వా స్పేస్ డెవలపర్స్…. రూ.39.2 కోట్ల ఎకరాల చొప్పున 7.5 ఎకరాలు సొంతం చేసుకున్నారు వర్సిటీ ఎడ్యుకేషన్… మొత్తం 49.9 ఎకరాల వేలం ద్వారా రెండు వేల కోట్లు సమకూర్చుకుంది ప్రభుత్వం.. ఎకరం రూ.25 కోట్లతో వేలం మొదలు కాగా.. సౌత్ ఇండియాలోనే ప్రభుత్వ భూముల్లో అత్యధిక కొత్త రికార్డు సృష్టించాయి..
Also Read
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..