Kishan Reddy: రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ లో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ అసెంబ్లీ, తార్నాక అడ్డగుట్ట డివిజన్లో పర్యటించనున్నారు. అక్కడ కలకంటి అపార్ట్మెంట్స్, తార్నాక చింతల్ బస్తీ ప్రజలతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి ఎస్ఎస్ పార్ట్మెంట్స్, హైట్స్ సండే మార్కెట్, శ్రీకర్ శ్రీవాస అపార్ట్మెంట్ స్ట్రీట్ నెంబర్ 3 పర్యటించి బీజేపీ అందిస్తున్న పథకాల గురించి వివరించనున్నారు.
Read also: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!
శాంతినగర్ అడ్డగుట్ట, తుకారం గేట్ లో పర్యటించి ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ కు బయలుదేరనున్నారు. అక్కడ చేరుకుని మహబూబ్ నగర్ లో జరిగే కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ సమావేశం అనంతరం ఇక సాయంత్రం 5:30 ఖైరతాబాద్ అసెంబ్లీలో పర్యటించనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్లో పర్యటిస్తారు.. ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్, ఖైరతాబాద్, సిద్ధార్థ అపార్ట్మెంట్, రోడ్ నెంబర్ 12, బంజర హిల్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Read also: Chennai Pub accident: పబ్ లో విషాదం.. ముగ్గురు దుర్మరణం.. పలువురికి గాయాలు..!
తాజాగా సికింద్రాబాద్ లోని పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంకటగిరిలో పర్యటించారు. వెంకటగిరి చేరుకున్న కేంద్రమంత్రి తొలుత స్థానిక పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం బస్తీలో స్థానికులతో ముచ్చటించారు. అట్రియా 10 మంది అపార్ట్‌మెంట్ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం శ్రీనగర్ కాలనీలోని సాయికిరణ్ అపార్ట్ మెంట్ లో కేంద్రమంత్రి పర్యటించారు. అపార్ట్‌మెంట్‌లోని మహిళలు వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి అపార్ట్‌మెంట్ పెద్దలు, సంక్షేమ సంఘం సభ్యులతో కాసేపు ముచ్చటించారు. తాను అంబర్ పేట్ బిడ్డనని, సికింద్రాబాద్ ఎంపీ కాకముందు అంబర్ పేట్ ప్రజలు నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈసారి కూడా సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Houthi Rebels: హౌతీ రెబల్స్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా..