Kishan Reddy : హైదరాబాద్ అభివృద్ధి కోసం బిజెపిని గెలిపించండి
- జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉధృత ప్రచారం
- పాదయాత్రలతో ఓటర్ల దగ్గరకు నేతలు
- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో మాస్ క్యాంపెయిన్..
- పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంగళవారం నియోజకవర్గంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ‘మాస్ కాంపెయిన్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి ఓటరునూ కలుసుకుని ఓట్లు అభ్యర్థించేలా పాదయాత్రలు ఘనంగా నిర్వహించారు. ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్లో పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నేతలు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విధానాలపై మండిపడ్డారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు అవకాశం కల్పించారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే జూబ్లిహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పదేండ్లు బీఆర్ఎస్, రెండేండ్లుగా కాంగ్రెస్ జూబ్లిహిల్స్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గడపగడపకూ తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను వివరించారు. ఆరు గ్యారంటీలు సహా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌తో ఎంఐఎం లోపాయికారీ ఒప్పందంపై మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో కలిసిపోతూ హైదరాబాద్ అభివృద్ధిని ఎంఐఎం అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో ఎదురయ్యే సమస్యలను వివరించారు. రౌడీషీటర్లను ప్రోత్సహిస్తూ, కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు ఈ రెండు పార్టీలు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల పోటీలో లేకుండానే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పెత్తనం అంతా ఎంఐఎం చేస్తుందని ఆరోపించారు. నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గుండాయిజం, కబ్జాలు, రౌడీషీటర్ల నుంచి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకారంతో జూబ్లిహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్డు, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం.. అవసరమైన చోట బస్తీ దవాఖానాల ఏర్పాటు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు వివరించారు. ప్రజల కష్టాలు, ఇబ్బందులు ఆరా తీస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ నేతలు ప్రచారం చేశారు. బీజేపీకి ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు
Yogi Adityanath: సీఎం యోగి కీలక నిర్ణయం.. ముస్తఫాబాద్ పేరు ఇక..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!