Union Minister Kishan Reddy Fired on CM KCR over SC, ST Reservations and Paddy Procurement.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఎన్టీవీ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన కేంద్రం అభ్యంతరం చెప్పదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని, సైన్స్ సిటీ, చేనేత క్లస్టర్, మెడికల్ కాలేజ్ లకి సంబంధించి కావాలనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం లేదన్నారు. ప్రతిదీ రాజకీయం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినా ఏమీ చేయలేదని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు వరి ధాన్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది రావడం లేదు.. కానీ కేసీఆర్ కే ఎందుకు ఇబ్బంది వస్తోందని ఆయన ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొంటామని, గతంలో నిర్దేశించిన టార్గెట్ ధాన్యం కూడా కేసీఆర్ ఇవ్వలేకపోయారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. డబ్బులతో , మీడియా ను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం భ్రమ అని ఆయన హితవు పలికారు. చంద్రబాబు కి ఇవన్నీ ఉన్న ఓడిపోయారు కదా అని ఆయన గుర్తు చేశారు.